బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 65 మంది మైనర్లను రక్షించిన చీఫ్ మైనింగ్ ఇంజినీర్ జస్వంత్ గిల్ జీవిత కథ ఆధారంగా తిను సురేశ్ దేశాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ఒక మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ సిక్కు అవతారంలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం 100 ఎకరాల విస్తీర్ణంలో సేట్ వేసినట్టు తెలుస్తోంది. 300 మందికి పైగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సెట్స్ యూకేలో కూడా వేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు, లండన్ శివార్లలోని నిజమైన బొగ్గు మైనింగ్ స్పాట్‌లో కూడా సినిమా బృందం షూటింగ్ చేయనుంది. ఇటీవల, UK నుండి అక్షయ్ జవంత్ గిల్‌గా కనిపించిన లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రస్తుతం క్యాప్సూల్ గిల్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుగుతుంది. జులై 4న చిత్రీకరణ ప్రారంభించిన సినీ బృందం.. 100 ఎకరాల స్థలంలో 2 నెలల పాటు చిత్రీకరణ జరుపుకోనుంది. ఇక.. ఆగస్ట్ నెలాఖరులోపు షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, దిబ్యేందు భట్టాచార్య, రవి కిషన్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో వీరేంద్ర సక్సేనా, వరుణ్ బడోలా, రాజేష్ శర్మ , అనంత్ మహదేవన్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.