Sunday, November 24, 2024

నిహారిక భర్త గొడవ విషయంలో పోలీసులకు తెలిసిన నిజాలివే!!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త చైతన్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన అపార్ట్మెంట్ వాసులు చైతన్య పై న్యూసెన్స్ కేసు నమోదు పెట్టారు. కాగా ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిసాయట. అపార్ట్మెంట్లో చైతన్య ప్రతిరోజూ పార్టీలు చేస్తారని యువకులతో కలిసి హంగామా చేస్తూ ఉంటారని…దీనితో అపార్ట్మెంట్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దర్యాప్తులో తేలిందట.

గత రాత్రి కూడా ఇలానే జరగడంతో వారంతా ప్రశ్నించగా…చైతన్య తీవ్ర ఆవేశానికి లోనై అపార్ట్మెంట్ వాసులను దూషించినట్లు తెలుస్తోంది. దీనితో బారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే చైతన్య కూడా అపార్ట్మెంట్ వాసులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సిసి ఫుటేజీలను సేకరించే పనిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement