దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే ఫార్ములాను ఫాలో అవుతూ ఉంటారు హీరోయిన్స్ . వయసులో ఉన్నప్పుడే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని సినిమాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే తెలుగు తమిళ భాషల్లో అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష… ప్రస్తుతం అవకాశాలు లేక పోవడంతో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తోందట.
నిజానికి కొన్ని ఏళ్ళ క్రితమే వివాహం చేసుకునేందుకు త్రిష సిద్ధమైంది. ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఆఖరి క్షణంలో నిశ్చితార్ధం క్యాన్సల్ అయింది. ఇక అప్పటి నుంచి త్రిష పెళ్లి గురించి ప్రస్తావించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లి విషయం తెర మీదకు వచ్చింది. మరి ఈసారైనా త్రిష పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం త్రిష చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.