ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కు అవకాశాలు తగ్గాయి. దీంతో బిజినెస్ ల పై దృష్టి పెట్టింది. మామూలుగా రకుల్ ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. అంతేకాకుండా బిజినెస్ కి సంబంధించిన కొన్ని చిట్కాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా వ్యాయామాలు యోగా కు సంబంధించిన వీడియోలను కూడా అప్పుడప్పుడు ఈ అమ్మడు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
కాగా తాజాగా రకుల్ వ్యాయామ అలవాట్లపై స్పందించింది. వ్యాయామం శరీరతత్వం పై పూర్తి అవగాహన కొరకు ఫిట్నెస్ అనే సబ్జెక్టు చదవాలని యోగా ఎడ్యుకేషన్ గురించి కూడా తెలుసుకోవాలని…. వ్యాయామం ఫిట్ నెస్ ఇస్తే యోగా పాజిటివ్ దృక్పథాన్ని కల్పిస్తుందన్నారు. వృత్తులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకే ఫార్మాట్ వ్యాయామానికి పరిమితం కావడం మంచిది కాదని చాలామంది ఫిట్ నేస్ అంటే సిక్స్ ప్యాక్ అనుకొని భ్రమలో ఉన్నారని చెప్పుకొచ్చింది.