Monday, November 18, 2024

పెళ్లి పై ఎలాంటి ఆలోచన లేదు…సీనియర్ హీరోయిన్

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక ఏ విషయం అయినా ఇట్టే వైరల్ అవుతూ వస్తోంది. సెలబ్రిటీల విషయంలో అయితే అది కాస్త మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రేమ పెళ్లి పై కూడా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో ధర్మచక్రం , ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి ప్రేమకు మంచి పేరును తీసుకువచ్చాయి. అయితే ఆ తర్వాత ప్రేమ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ప్రేమ వివాహం అయిన తర్వాత సినిమాకు దూరంగా ఉంటూనే వచ్చింది.

అయితే కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న ప్రేమ చాలా కాలంగా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డారు. మహమ్మారి నుండి కోలుకున్నారు. కాగా తాజాగా ఆమె పెళ్లి వార్తలపై స్పందించింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని అలాంటి ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. కాగా ఈ క్లారిటీతో ప్రేమ పెళ్లి విషయం పై ఫేక్ వార్తలను బ్రేక్ పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement