హీరోయిన్ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది ఈ అమ్మడు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది, హలో గురు ప్రేమకోసమే, బావా, రభస, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలలో నటించింది ఈ అమ్మడు.
సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఆదివారం ప్రణీత ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధువులు స్నేహితుల మధ్య వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.