Monday, November 18, 2024

బిగ్ బాస్ సీజన్5…కాస్త డోస్ ఎక్కువే ఉంటుందట!!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. వివిధ భాషలలో ఈ షో దూసుకుపోతుంది. ఇక తెలుగులో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకుని ఐదవ సీజన్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ ఐదవ సీజన్ కోసం అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మేకర్స్ ఈ సీజన్ సరికొత్తగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒక అంశంపై మరింత కాన్సన్ట్రేషన్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

అది మరేదో కాదట. ఈ సీజన్ లో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగా ఉంటుందట. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండేటట్లు ప్లాన్ చేశారట. హౌస్ లో జరిగే గొడవలు, సరదా, స్నేహం తో పాటుగా వినోదం కూడా ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే షోలో పార్టిసిపేట్ చేసేది వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా వారే హౌస్ లోకి వస్తారా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement