దుబాయ్ వేదికగా ‘గామా’ తెలుగు మూవీ అవార్డ్స్ 4వ ఎడిషన్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్ మార్చి 3న దుబాయ్‌లోని జాబిల్ పార్క్‌లో వార్డు వేడుకను నిర్వహించనున్నారు. గతంలో అంగరంగ వైభవంగా జరిగిన గామా అవార్డులు కోవిడ్ కారణంగా మూడేళ్లపాటు నిర్వహించలేకపోయారు. ఈసారి అవార్డుల వేడుక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది.
ఈ ఈవెంట్లో 2021, 2022, 2023లలో విడుదలైన సినిమాల నుంచి.. బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్.. వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందిచనున్నారు.
కాగా, ఈ గామా వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత DVV దానయ్య, సాయి రాజేష్, ప్రసన్న, డింపుల్ హయతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్.. పలువురు ప్రముఖులు హాజరయి ఈ అవార్డుకు సంబంధించిన ట్రోఫీని లాంచ్ చేశారు.