Wednesday, November 20, 2024

పెళ్లి సందD మూవీ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది !!

రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ పెళ్లి సందడి. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ గా పెళ్లి సందD సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. కొత్త దర్శకురాలు గౌరీ రోనక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పెళ్లి సందడికి సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 28న ఉదయం 11 గంటలకు ప్రేమంటే ఏంటి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement