Tuesday, November 26, 2024

నిర్మాతలకు తప్పని కష్టాలు…!!

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై మరోసారి పగ పట్టిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. గత ఏడాది మొత్తం ఈ మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతపడ్డాయి. అలాగే షూటింగ్ లు సైతం నిలిచిపోయాయి. ఇక ఇప్పుడిప్పుడే థియేటర్స్ లో ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో చాలా సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి.

అందులో ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలైన రాధే శ్యామ్, ఆర్ ఆర్ఆర్, కే జి ఎఫ్ 2 సినిమాల రిలీజ్ లు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కుతున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక రాధే శ్యామ్ షూటింగ్ కూడా కొంచెం పెండింగ్ లో ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే పాటల చిత్రీకరణతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పెండింగ్ లో ఉంది.

ఒకవేళ షూటింగ్ లు పూర్తి అయినా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ అవుతాయి అంటే కష్టమే అని చెప్పాలి. దీంతో నిర్మాతలపై ఆర్థికభారం రోజు రోజుకీ పెరుగుతోంది. 100% ఆక్యుపెన్సీ లేకపోతే నిర్మాతలకు కష్టాలు తప్పవు. 2020 ముగింపులులో మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టు ఇప్పుడు కూడా తగ్గకపోతే నిర్మాతలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement