Thursday, November 21, 2024

చిన్నారి పెద్ద మనసు…దాచుకున్న డబ్బును చిరు ట్రస్ట్ కు దానం

కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలు ఆక్సిజన్ అందక మందులు ఖర్చులకు డబ్బులు లేక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది స్టార్స్ వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాగా ఓ చిన్నారి జన్మదినం నేడు. ఆ చిన్నారి వయసు చిన్నదైనా మనసుమాత్రం ఆకాశమంత పెద్దదని నిరూపించుకుంది. తాను పోగు చేసుకున్న డబ్బుతో , జన్మదిన వేడుకలు జరుపుకోకుండా చిరంజీవి ట్రస్ట్ కి దానంగా ఆ సొమ్మును ఇచ్చేసింది.

అంతే కాకుండా ఆ చిన్నారి మాట్లాడుతూ….తాను దానం చేసిన డబ్బుతో కరోనా భారిన పడిన వారికి ఆక్సిజన్ లేక ఇతరేతర సహాయానికి వాడాలని చెప్పింది. మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటేనే మనం సంతోషంగా ఉంటాం అని చెప్తూ… తనకి హీరో చిరంజీవి పై నమ్మకముందని తాను తప్పక నా మాటను మన్నించి ఇతరులకు సాహయపడగలరని నమ్మకం తో వారి నిర్వహించే ట్రస్ట్ కు పోగు చేసుకున్నా డబ్బును దానం చేశానని చెప్పింది. విషయం తెలుసుకున్న చిరంజీవి చిన్నారి చూపిన నమ్మకానికి తాను మోహితమైపోయానని , సేవ చెయ్యడంలో రెండింతల ఉత్సాహం పెరిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement