Wednesday, December 18, 2024

OTT | ఓటీటీల‌కు కేంద్రం వార్నింగ్.. ఆ కంటెంట్ ఉండొద్దు

ఓటీటీ సంస్థ‌ల‌కు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఓటీటీల్లోని వెబ్ సిరీస్‌, సినిమాలలో డ్రగ్స్ వినియోగం, బోల్డ్ కంటెంట్ విప‌రీతంగా పెరుగుతుంది. వీటిపై సెన్సార్ లేకపోవడంతో మేకర్స్ కూడా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆ కంటెంట్‌పై కేంద్రానికి చాలా ఫిర్యాదులు అందాయి.

కాగా, ఆ ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అడ్వైజరీని జారీ చేసింది. ఇకపై డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, బోల్డ్ కంటెంట్‌ను చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇలాంటి కంటెంట్ వల్ల యువత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వినియోగదారుని హెచ్చరించకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించే వచ్చే సన్నివేశాలను ప్రసారం చేయరాదని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement