సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ అమ్మడు. అయితే గతంలో ఈ అమ్మడి పెళ్లి, ప్రేమాయణం కథలు చాలానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమ లో ఉంది నయనతార. కాగా ఇటీవల విగ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్ తో ముచ్చటించారు.
అయితే నయనతారలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్తూ…. నాకు ఆమె లో నచ్చింది ఆమె ఆత్మస్థైర్యం అంటూ జవాబిచ్చాడు. అలాగే నెట్రికన్ సినిమా గురించి అడగగా సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపాడు. ఇక వీరి పెళ్లి పై ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్నాయి. కాగా పెళ్లి పై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు చేయలేదు.