Tuesday, November 26, 2024

ఈ ఫొటో చూడగానే చెడిపోతారా? ఆపండెహె’..

సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు..తమిళ దర్శకుడు అగత్యన్‌ రెండో కుమార్తె, నటి విజయలక్ష్మి తాజాగా సోషల్‌ మీడియాలో తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. దీనికి “మమ్మీ… ఐ లవ్‌ యూ.. అతి పెద్ద గ్రహమైన బృహస్పతి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా..” అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో ఆమె తన కొడుక్కి ప్రేమగా ముద్దు పెట్టింది. అయితే ఆమె తన కొడుకు పెదాల మీద ముద్దివ్వడం నెటిజన్లకు పెద్దగా నచ్చినట్లు లేదు.

దీంతో కొందరు ఆమెకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పెడుతున్నారట. నీ పద్ధతేమీ బాగోలేదని విమర్శిస్తూ, చీదరించుకుంటూ చీవాట్లు పెడుతున్నారట. దీంతో ఆమె ఈ ట్రోలింగ్‌కు ఘాటుగా బదులిచ్చింది.దీని వెనకాల కూడా ఏమైనా సిద్ధాంతాలుంటాయా? ఈ ఫొటో చూడగానే చెడిపోతారా? ఆపండెహె’ అంటూ ట్వీట్‌ చేసింది. ఆమె అభిమానులు మాత్రం తల్లీకొడుకుల ఫొటో భలే ముద్దొస్తుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పెరుగుతున్న బాల్య వివాహాలు, గత నెలలో 18 కేసులు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement