Home ముఖ్యాంశాలు Jr.NTR | బన్నీకి తారక్ ఫోన్..

Jr.NTR | బన్నీకి తారక్ ఫోన్..

0
Jr.NTR | బన్నీకి తారక్ ఫోన్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట‌ ఘటనలో నిన్న అరెస్టయిన అల్లు అర్జున్… ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా, జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు దర్శక నిర్మాతలతో పాటు పలువురు స్టార్ హీరోలు బన్నీ నివాసానికి వస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ప్రస్తుతం వార్-2 షూటింగ్ లో భాగంగా ముంబైలో ఉన్న తారక్.. అల్లు అర్జున్ తో ఫోన్ లో మాట్లాడాడు. ఈ మేరకు అరెస్ట్ పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ బన్నీకి సంఘీభావం తెలిపారు.

పరామర్శించిన ప్రభాస్..

ఈ ఘటనపై ప్రభాస్ స్పందించాడు. బన్నీ అరెస్ట్ నేపథ్యంలో ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్‌ని పరామర్శించారు..

Exit mobile version