Sunday, December 22, 2024

HYD | అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత..

అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ వాల్ ఎక్కి… విద్యార్థి సంఘాల నేతలు ఆందోళ‌న చేప‌ట్టారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు.

బన్నీ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద సెక్యూరిటీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా… కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు రువ్వారు.ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

రాళ్ల దాడిలో అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement