Monday, November 25, 2024

Sobhita Dhulipalla :

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం, అది కాకుండా ఉత్తర భారతంలో మన తెలుగు అమ్మాయిలకు చిన్న పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా గొప్ప విషయం అనుకుంటున్న సమయంలో మన తెనాలి అమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల బాలీవుడ్‌ లో దున్నేస్తుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం దక్కించుకోవడం ద్వారా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించిన శోభిత అక్కడ మోడల్ గా కెరీర్‌ ను ప్రారంభించింది.

- Advertisement -

మోడలింగ్‌ లో రాణించిన శోభితా ధూళిపాళ్ల 2016 లో అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్‌ 2.0 సినిమాలో మొదటి సారి కనిపించింది. మొదట బాలీవుడ్‌ లో గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. కేవలం సినిమాలకు పరిమితం అవ్వకుండా వెబ్‌ సిరీస్ లు మరియు వెబ్‌ షో ల్లో కూడా ఈ అమ్మడు సందడి చేస్తూ కన్నుల విందు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ అమ్మడు ప్రముఖ మేగజైన్ కోసం అందాల ఆరబోత ఫోటో షూట్‌ స్టిల్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా బికినీ ధరించి బీచ్ లో ఇసుక తిన్నెలపై పడుకుంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం బికినీ ధరించి నులక మంచం పై పడుకుంది. నులక మంచం అనేది చాలా విభిన్నమైనది.. దానిపై బికినీ ధరించి పడుకోవడం అనేది అంతకు మించిన విభిన్నమైన ఆలోచన అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement