వెండితెరపై కదలాడే బొమ్మలను అభిమానిం చేవా రెందరో. చేసిన పాత్రలు ప్రేక్షకుల అభిమానం సంపాదించు కుంటాయి. దక్షిణాదిలో ఈ అభిమానం స్థాయి చాలా ఎక్కువ. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సినీతారలకు పిచ్చిగా ఆరాధిం చేవారు ఉంటారు. అందుకే ఇక్కడ విడుదలయ్యే సినిమాలకు లాంగ్రన్ ఉంటుంది. హీరోలకే కాదు వారితో సమానంగా హీరోయిన్స్ కి కూడా అభిమానించే వారుంటారు. వారి నటన నచ్చే లేదా వారి అందం నచ్చి ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోతారు. కొంతమంది అభిమానులు తమ అభిమాన హీరోయిన్స్ పేర్లు ఫోటోలు పచ్చ బొట్లు- కూడా వేయించుకుం టారు. కొంతమంది కొత్త సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. వీటన్నింటిని నాయికలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అభిమానం కొత్తపుంతలు తొక్కుతోంది. కొందరు ఫ్యాన్స్ ఏకంగా గుడులు కట్టేసి వారిని దేవతలుగా మార్చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.
అభిమాన తారలకు గుడులు కట్టించడం అనే ట్రెండ్ తమిళనాడులోనే ప్రారం భమైంది. 1990లో నటి ఖుష్బుకు గుడి కట్టించినప్పుడు అదొక సంచలనం. ఇప్పుడు ఈ తరహాలో అభిమానం చాటుకోవడం తెలుగునాట కూడా ప్రారంభమైంది. నటి సమంతకు ఓ వీరాభిమాని గుడి కట్టాడు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ తన ఇంట్లోనే గుడి నిర్మించి అందులో ఆమె విగ్రహం ఏర్పాటు- చేశాడు. ఖుష్భూకి అభిమానులు తిరుచురాపల్లిలో గుడి కట్టారు. అలా హీరోయిన్స్‌కి -టె-ంపుల్ కట్టే అలవాటు- మొదలైం ది. హీరోయిన్ గా వెలుగొందిన నగ్మా కి కూడా ఫ్యాన్స్ గుడులు కట్టారు. హాట్ బాంబ్ నమితకు కూడా అభిమానులు కోయం బత్తూర్ తిరునెల్వేలితో పాటు- మరొక ప్రాంతంలో గుడులు కట్టారు. దేశముదురు ఫేమ్, కొందరికి ఆరాధ్య దేవతగా మారింది. ఆమెకు చెన్నై శివారులో గుడి కట్టారు. అగ్రనటి కాజల్ కి కూడా తమిళనాడులో గుడి కట్టేశారు.
నవతరం నటి నిధి అగర్వాల్ తమిళంలో భూమి ఈశ్వర్ చిత్రాలలో నటించారు. రెండు సినిమా లతోనే ఆమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో చెన్నైలో ఆమెకి గుడి కట్టేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సమంత వచ్చి చేరింది. అయితే మిగిలిన హీరోయిన్స్ అందరికి కూడా తమిళనాడులో అభిమానులు గుడులు కట్టారు. కాని సమంతకి ఏపీలో బాపట్ల జిల్లా చుండూరు మండలానికి చెందిన సందీప్ అభిమానంతో తన ఇంటి ఆవరణంలోనే గుడి కట్టారు. మాయోసైటిస్ నుంచి సమంత కోలుకోవాలని పుణ్యక్షేత్రాలు దర్శించారు. ఇప్పుడు గుడి కట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.