Saturday, November 23, 2024

ఒక్క హిట్…కోటి రూపాయలు డిమాండ్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఓ బేబీ, జాంబి రెడ్డి చిత్రాలతో సక్సెస్ అందుకున్నాడు తేజ సజ్జా. అయితే ప్రస్తుతం ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. అలాగే సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో తేజ సజ్జ రెమ్యూనరేషన్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తేజ రెమ్యునరేషన్ కోటి రూపాయలు తీసుకుంటున్నాడట. నిజానికి జాంబి రెడ్డి చిత్రం థియేటర్స్ లో నాలుగున్నర కోట్ల దాకా బిజినెస్ చేసింది. ఇక మిగిలిన వాటిలో ఈ సినిమాకు మరికాస్త సొమ్ము చేరి ఉంటుంది. నిజానికి ఈ సినిమా అంత సక్సెస్ సాధించడానికి కారణం… ముందు సినిమాకు జరిగిన ప్రమోషన్ అనే చెప్పాలి. ఏదేమైనా ఒక్క హిట్ తో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అడగటంతో తేజ పేరు ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement