హీరోయిన్ తాప్సీ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో కోట్లాదిమంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందింది. అయితే డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్ తో హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడింది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.
తాజాగా ఈ వార్తలపై స్పందించిన తనకు పెళ్లి చేసుకునే అవకాశం ఇప్పట్లో లేదని… అలాగే సినీ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. రాణించే వృత్తి వ్యక్తిగత జీవితం వేరువేరుగా ఉండాలని చెప్పుకొచ్చింది. అలాగే మ్యాథ్యూస్ తనకు మంచి సన్నిహితుడని బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సంవత్సరానికి ఆరు సినిమాలు చేస్తున్నానని ఆ సినిమాల సంఖ్య 2,3 కు తగ్గినప్పుడు పెళ్లి చేసుకుంటానని అన్నారు తాప్సీ.