Sunday, September 15, 2024

AP: ఆగస్టు 15న తంగలాన్ మూవీ.. హీరో విక్రమ్

(ప్రభ న్యూస్, విజయవాడ) : ఆగస్టు 15 తంగలాన్ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందని ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్ర‌ముఖ‌ సినిమా హీరో చియాన్ విక్రమ్ తెలిపారు. ఒక కొత్త క్యారెక్టర్ తో ఈ చిత్రంలో ప్రేక్షకులకు కనిపిస్తానని దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశారన్నారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. నగరంలో ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ సందడి చేసారు. తంగలాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా బందరు రోడ్డులోని ఒక హోటల్లో చిత్త యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చియాన్ విక్రమ్ మీడియాతో మాట్లాడారు. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ, నాన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తంగలాన్ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తంగలాన్ ఒక ఎమోషనల్ మూవీ అని కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చన్నారు.

హీరోయిన్ మాళవిక మోహనన్ ఒక కొత్త క్యారెక్టర్ లో కనిపిస్తారని చెప్పారు. లండన్ నుంచి వచ్చిన డేనియల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారని ఆయన నటన అద్భుతంగా ఉందన్నారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి ప్రాణం పోశారని పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ… విక్ర‌మ్ తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో ఒక ఫైటర్ గా ప్రేక్షకులకు కనిపిస్తానని, ఫైట్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయని ఆమె తెలిపారు. ఆగస్టు 15న తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ఆమె ప్రేక్షకులను కోరారు.

అనంతరం నటుడు డేనియల్ మాట్లాడుతూ… దర్శకుడు పా రంజిత్ చెప్పిన కథ నచ్చి చిత్రంలో విలన్ క్యారెక్టర్ లో నటించడం జరిగిందన్నారు. హీరో విక్రమ్ తో కలిసి నటించ‌డం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన సహకారం మరువలేనిదని తెలిపారు. విలేకరుల సమావేశంలో సహనిర్మాత ధనుంజయ్ పాల్గొన్నారు. కాగా తొలుత హీరో చియాన్ విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహనన్ గాంధీనగర్ లోని బాబాయ్ హోటల్ కి వెళ్లి టిఫిన్ చేశారు. హీరో విక్రమ్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement