Thursday, September 19, 2024

OTT | ఓటీటీలోకి తంగలాన్ వ‌చ్చేది అప్పుడేనా !

పా రంజిత్‌ దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్ నటించిన లేటెస్ట్‌ మూవీ తంగలాన్‌. స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైన బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. కాగా, విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

దీంతో చాలా గ్యాప్ తర్వాత తంగలాన్‌తో విక్రమ్‌ సాలీడ్‌ హిట్‌ అందుకున్నాడు. థియేట్రికల్‌ రన్‌ సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. తంగలాన్‌ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోగా… సెప్టెంబర్‌ 20 నుంచి స్ట్రీమింగ్‌ ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుందట.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని సమాచారం. తాజా బజ్‌ ప్రకారం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు రానుందనే టాక్‌. అయితే, హిందీ వెర్షన్‌ను మాత్రం కాస్తా ఆలస్యంగా రిలీజ్‌ చేయనున్నారట. సెప్టెంబర్ 27న తంగలాన్ హిందీ వెర్షన్ అందుబాటులో ఉంచనునుందని టాక్‌. మరి దీనిపై క్లారిటీ రావాలంటే నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement