Saturday, June 29, 2024

Tandel రిలీజ్ డేట్ ఫిక్స్….

చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తండేల్. సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. హీరో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి., మళ్లీ ఇండియాకి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా శ్రీకాకుళంలో సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఇకపై తరచుగా సినిమా రిలీజ్ అయ్యేంతవరకు చిత్రం నుండి వరుస అప్డేట్స్ రానున్నట్లు జిఏ 2 పిక్చర్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత బాణీలను అందిస్తున్నాడు. తండేల్ సినిమాను జిఏ 2 పిక్చర్స్ పతకం పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.

అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పక్కులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 20న ఫిక్స్ చేశారు. చాలా రోజుల తర్వాత నాగచైతన్య నుండి రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అది కాకుండా లేడీ మెగాస్టార్ సాయి పల్లవి కూడా ఇందులో నటిస్తుండడం సినిమాకు ప్లస్ గా నిలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement