Thursday, September 5, 2024

Taapsee Pannu | పారిస్ వీధుల్లో తాప్సీ…

ఒకప్పుడు సౌత్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తాప్సి తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ యాక్టర్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఫీమేల్ సెంట్రిక్ కథలకి తాప్సి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటుంది. బయోపిక్ లు కూడా ఎక్కువగా చేస్తోంది.

ఆగష్టులో తాప్సి నుంచి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. హసీనా దిల్ రుబాకి సీక్వెల్ గా తెరకెక్కిన ప్యార్ అవి హసీనా దిల్ రుబా మూవీ ఆగష్టు 9న థియేటర్స్ లోకి వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా తాప్సి ఇన్ స్టాగ్రామ్ లో పారిస్ లో దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

బ్లాక్ శారీలో ఈ అమ్మడు హోటల్ లో దిగిన పిక్ ని పంచుకుంది. అలాగే పారిస్ రోడ్లు మీద హ్యాపీ రిఫ్రెష్ అవుతూ ఉన్న ఫోటోలు, వీడియోస్ ని పంచుకుంది. వీటిని షేర్ చేయడంతో పాటు ఖేల్ ఖేల్ మెయిన్ మూవీ ట్రైలర్ కి పబ్లిక్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని పోస్ట్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement