ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది హీరోలతో నటించి మెప్పించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మారిన తాప్సి సోషల్ మీడియా సెన్షేషన్ అన్నట్లుగా ఫోటోలు షేర్ చేస్తుంది.
ఆకట్టుకునే అందంతో పాటు, మంచి స్టైల్ ను మెయింటెన్ చేయడం ద్వారా రెగ్యులర్ గా వార్తల్లో నిలవడమే కాకుండా, తాను షేర్ చేసిన ఫోటోలతో వైరల్ అవుతూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఇలా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో సందడి చేసింది. ఈ ఫోటోలను షేర్ చేసిన తాప్సి ఇన్ స్టా లో చెక్‌మేట్ అంటూ కామెంట్ పెట్టి కుర్రాళ్లకు తన బ్లాక్ అందంతో చెక్ పెట్టింది అనడంలో సందేహం లేదు…