Tuesday, July 2, 2024

Swayambhu | స్పీడ్‌గా నిఖిల్‌ ‘స్వ‌యంభూ’ షూటింగ్..

నిఖిల్‌ ‘కార్తికేయ 2′, ’18 పేజెస్‌’, ‘స్పై’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ హిట్స్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.

కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా సాగుతున్న స్వయంభూ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతుంది. అటవీ ప్రాంతంకు సంబంధించిన షూటింగ్‌ ను నిర్వహిస్తున్నారు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. నిఖిల్‌ తో పాటు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారట.

ఈ షెడ్యూల్‌ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ నిర్మాణం జరిగిందట. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా కోసం ఎమ్‌ ప్రభాకరన్‌ ఆర్ట్‌ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్‌ కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను దర్శకుడు భరత్‌ రూపొందిస్తున్నాడు.

నిఖిల్‌ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిఖిల్‌ ఈ సినిమాతో ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాలని భావించినప్పటికి కూడా షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా ఈ ఏడాది విడుదల సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విడుదల విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement