Sunday, December 29, 2024

Mad Square | స్వాతి రెడ్డి సాంగ్ రిలీజ్ !

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న మూవీ ‘మ్యాడ్ స్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, తాజాగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

మ్యాడ్ పిచ్చి సినిమాలోని ‘స్వాతిరెడ్డి’ పాట అప్పట్లో ఎలా ట్రెండ్ క్రియేట్ చేసిందో చూశాం. ఇప్పుడు ఈ పాటను ఫుల్ లెంగ్త్ లో వినియోగించారు. ఈ పాటలో అందాల భామ రెబా మోనికా జాన్ మాస్ నెంబర్ స్టెప్పులతో ఇరగదీసింది. ఇక ఈ సినిమా హీరోలు రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్‌లు కూడా ఈ పాటలో కనిపిస్తున్నారు.

ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసి పాడగా, ఒరిజినల్ పాట పాడిన స్వాతి రెడ్డి కూడా ఈ పాటను పాడారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement