Saturday, July 6, 2024

SVC58 | గ‌న్ తో గులాబీ బాల‌…

విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “SVC58” ప్రాజెక్టు షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. మెయిన్ హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ ఎంపిక చేయాలని చూస్తున్నారని సమాచారం. ఈ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్‌లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, భార్య మధ్యలో కథ నడుస్తుందట.

ఈ చిత్రంలో వెంకటేష్ సోలో హీరోగానే కనిపించనున్నారు. ఇక ఇక లేటెస్ట్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరి లుక్ రివీల్ చేశారు. అందులో ఆమె గన్ను పట్టుకొని కనిపిస్తోంది. అందమైన అమ్మాయి అలా గన్ను పట్టుకొని కనిపిస్తోంది అంటే ఆమె అతని ప్రేయసి అని అర్ధమవుతుంది. ఇక సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని రివీల్ చేశారు. యాక్షన్ డోస్ కూడా ఆమె క్యారెక్టర్ లో గట్టిగానే ఉంటుందని అర్ధమవుతుంది.

ఇక సినిమా పూజా కార్యక్రమాలు నేడు నిర్వ‌హించారు. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement