సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు చేసిన సేవలను కొనియాడుతూ మూడు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసింది. అయితే తనకు లభించిన ఈ పురస్కారాన్ని తన కెరీర్ తొలిరోజుల్లో ఎంతగానో ప్రోత్సహించిన వారికి అంకితం ఇచ్చి రజనీకాంత్ తన మంచితనాన్ని చాటుకున్నారు. బస్ కండక్టర్ గా పనిచేసే రోజుల్లో తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను పసిగట్టి ప్రోత్సహించిన బస్ డ్రైవర్ రాజ్ బహుదూర్‌తో పాటు తన కోసం జీవితాన్ని త్యాగం చేసిన తన అన్న సత్యనారాయనరావు గైక్వాడ్, అలాగే రజనీకాంత్ అనే తనను క్రియేట్ చేసిన తన గురువు కె. బాలచందర్‌కు ఈ అవార్డ్ ను అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక తమిళ చిత్రపరిశ్రమలో శివాజీగణేశన్, బాలచందర్ తర్వాత ఈ అవార్డ్ అందుకోబోతున్న మూడో వ్యక్తి రజనీకాంత్ కావటం విశేషం. అయితే తనలోని నటుడిని గుర్తించి సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించిన స్నేహితుడు, బస్ డ్రైవర్ రాజ్ బహదూర్‌కు ఈ అవార్డును రజనీకాంత్ అంకితమిచ్చారు. తాను కండక్టర్‌గా ఉన్నప్పుడు ఎప్పటికైనా గొప్ప నటుడివి అవుతావని, డ్రైవర్ రాజ్ బహదూర్ చెప్పేవాడని గుర్తుచేసుకున్నారు.