సింగర్ సునీత కుమారై శ్రేయ ఫారెన్ లో చదువుతోంది. కాగా తన కుమార్తెను కలిసేందుకు వెళ్లారు సునీత. అక్కడ శ్రేయను చూసిన వెంటనే కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసి.. ఆ మూమెంట్ తన జీవితంలో వెలకట్టలేని జ్ఞాపకం అన్నారు. కాగా సునీత గాయని మాత్రమే కాదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎందరో హీరోయిన్స్‌కు ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు. మరోవైపు పాటల కార్యక్రమాలకు హోస్ట్‌గా, న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సునీతకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు ఆకాష్ కాగా, అమ్మాయి పేరు శ్రేయ.
సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతోన్న సర్కార్ నౌకరి అనే చిత్రంతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. గంగనమోని శేఖర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుంది. ఇకపోతే సునీత కుమార్తె శ్రేయ.. కూడా తన అమ్మలాగే ఎంతో అందంగా ఉంటుంది. ప్రజంట్ విదేశాల్లో చదువుకుంటున్న శ్రేయ.. నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో టిక్ టిక్ టిక్ అనే పాటను పాడారు కూడా. శ్రేయ గాత్రం కూడా చాలా బాగుంది. సంగీతం అంటే ఎంతో ఇష్టం కూడా. అమ్మ నుంచి అందాన్ని, అద్భుతమైన గాత్రాన్ని పొందిన శ్రేయ.. తర్వాతి కాలంలో సింగర్‌గా రాణిస్తుందో.. హీరోయిన్గా మెప్పిస్తుందో.. లేదా రెండు విభాగాల్లో దూసుకుపోతుందో చూడాలి.