అక్కినేని సుమంత్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయమై ఆర్జివి స్పందిస్తూ… ఒకసారి జరిగింది.. చాలదా మళ్లీ కావాలా అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇక ఈ విషయంపై తాజాగా సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి వార్తలు అన్ని పుకార్లేనని తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేశాడు.
ఇక వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పెళ్లి పత్రిక అని ఆ సినిమాలో హీరోయిన్ పేరు పవిత్ర అని పెళ్లి, విడాకులు వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది అని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించి ప్రకటన కూడా త్వరలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో సుమంత్ పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది.