Tuesday, September 17, 2024

Suhas | ‘జనక అయితే గనక’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

నటుడు సుహాస్ ప్రస్తుతం నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనక అయితే గనక’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. ఈరోజు ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే ఈరోజు సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా పోస్టర్ తో ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో సంగీర్తన హీరోయిన్‌గా నటించగా సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement