Saturday, September 21, 2024

Stree 2 | బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్త్రీ 2…

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ నటించిన హార్రర్ కామెడీ మూవీ ‘స్త్రీ 2’. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా రూ.456 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో, 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతొంది. ఈ సినిమా 9వ రోజు ఇండియాలో దాదాపు రూ.17 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇండియాలో రూ.327 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించి అరుదైన మైలురాయిని దాటేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement