సినిమా ఎంత గ్రాండ్ గా తెరక్కిస్తారో.. అంతకు మించి గ్రాండ్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తారు రాజమౌళి. ఆయన సినిమా సక్సెస్ సూత్రంలో ప్రమోషన్స్ కూడా ఒక భాగం. బాహుబలి చిత్రంతో వెయ్యికోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త మార్కెట్ సూత్రాలు ఇండియన్ సినిమాకు నేర్పాడు ఆయన. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. కాగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
తాజాగా చిత్రం నుండి దోస్తీ అనే సాంగ్ విడుదల చేశారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఐదు భాషల్లో రూపొందిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ పాట ఐడియా మొత్తం ఎస్.ఎస్.కార్తికేయదేనని తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సాంగ్ చిత్రీకరణలో ఉన్నప్పుడు దోస్తీ వీడియా సాంగ్ గురించి చెప్పాడు కార్తికయ. కొరియోగ్రాఫర్ సతీష్, దినేష్కృష్ణన్తో కలిసి కార్తికేయ ఈ వీడియో రూపొందించారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో భాషల్లో ఈ పాటను ఆలపించిన అమిత్ త్రివేది, అనిరుద్, విజయ్ యేసుదాసు థ్యాంక్స్. పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు’’ అని జక్కన్న స్పష్టం చేశాడు.
ఇది కూడా చదవండి: బీ అలర్ట్: ఆగస్టులోనే థర్డ్ వేవ్ ముప్పు..?