తనదైన అందం అభినయంతో దశాబ్ధాల పాటు నటిగా ఏలిన శ్రీయ శరణ్ ముంబైలో భర్తతో కాపురం పెట్టిన తర్వాత తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ని శ్రీయ ప్రారంభించింది.ఇటీవల వరుస ఫోటోషూట్లతోను శ్రీయ చెలరేగుతోంది. ఇప్పుడు మరో ఘాటైన ఫోటోషూట్ తో శ్రీయ చెలరేగింది.
శ్రీయ మై సౌత్ దివా 2024 క్యాలెండర్ పై దర్శనమిచ్చింది. ఇందులో అందమైన తెల్లని డిజైనర్ చీర డిజైనర్ బ్లౌజ్లో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. శ్రీయ గ్లామ్ కంటెంట్ యువతరానికి స్పెషల్ ట్రీట్ గా మారింది. పెళ్లయి బిడ్డ పుట్టాక కూడా ఇంత అందాన్ని ఎలా మెయింటెయిన్ చేస్తోంది? అనే సందేహాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీయ 40 ప్లస్ ఏజ్ లోను పర్ఫెక్ట్ ఫిట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్ కి ఆసక్తికర క్యాప్షన్ ని జోడించారు.