Thursday, September 19, 2024

SWAG | శ్రీవిష్ణు గెట‌ప్ అద‌ర‌హో….

ఇటీవల వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. రాజ రాజ చోర చిత్రంతో శ్రీ విష్ణు మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ త‌రువాత సామజవరగమన సినిమాతో కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు. లేటెస్ట్‌గా ‘ఓం బీమ్ బుష్‌’తో సక్సెస్ ట్రాక్ కొనసాగించాడు.

ఇక ప్రస్తుతం హసిత్ గోలీ ద‌ర్శ‌క‌త్వంలో ‘స్వాగ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు శ్రీ విష్ణు.. వీరి కాంబోలో ఇప్పటికే ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ‌ చోర’ సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. కాగా, ప్ర‌స్తుతం పీపుల్స్ మీడియా నిర్మిస్తోన్న ‘స్వాగ్’ మూవీ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. స‌రికొత్త గెట‌ప్ శ్రీ విష్ణు అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. స్వాగ్ ఆడియో హక్కులను టిప్స్ మ్యూజిక్ సౌత్ కంపెనీ సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement