Tuesday, December 10, 2024

Srisailam : మ‌ల్ల‌న్న సేవలో నాగచైతన్య, శోభిత

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహ అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా నూతన జంట శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.

అక్కినేని నాగార్జునతో కలిసి చైతూ-శోభిత జంట శుక్రవారం శ్రీశైలం వెళ్లారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement