Sunday, November 24, 2024

శ్రీముఖి 31 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటుందట

బుల్లితెర యాంకర్ నటి శ్రీముఖి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే శ్రీముఖి ఓవైపు బుల్లితెరపై చేస్తూనే మరోవైపు వెండితెర పై కూడా మెరుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీముఖి పెళ్లికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందించారు శ్రీముఖి. మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని… పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని తనకు 31 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది. సింగర్ మనో, రాజా రవీంద్ర భరణి లతో కలిసి శ్రీముఖి సినిమాలో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement