దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ . ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
ఎప్పటి నుంచో దుల్కర్‌తో సినిమా చేయాలని వుండే ది. ఈ సినిమాతో కుదిరింది. దర్శకుడు అభిలాష్ జోషి ఈ సినిమా స్కేల్ గురించి చెప్పినపుడు చాలా ఆసక్తిక రంగా అనిపించింది. అచ్చమైన తెలుగు సినిమాలా వుంటుంది. ఇంత పెద్ద స్కేల్‌లో మలయాళీ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి.
ఇలాంటి సినిమాల్లో మీ పాత్ర ఎలా వుండబోతుంది?
చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర #స్క్రన్ టైం తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధన్యత వుంటుంది.
మీ పాత్రలో ఛాలెంజింగా అనిపించిన అంశాలు ఏమిటి ?
ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు చాలా ఛాలెంజింగా అనిపించింది. ఇందులో నా పేరు తార. దుల్కర్ పేరు రాజు. వారి మధ్య అందమైన లవ్ స్టొరీ కూడా వుంది.
ఈ కథ ఫిక్షనా.. లేదా యధార్థ సంఘటనలు ఆధారంగా తీశారా ?
ఇది ఫిక్షనల్ స్టొరీ. కోథా అంటే టౌన్ అని అర్ధం. అదొక ఫిక్షనల్ టౌన్. ఐతే యధార్థ పరిస్థితులని ప్రతిబింబిస్తుంది.
దుల్కర్ సల్మాన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
దుల్కర్ సల్మాన్ ట్రూ జెంటిల్ మెన్. తనతో మాట్లాడితే ఏదైనా నేర్చుకునేలా వుంటుంది. ఏదైనా సలహా అడిగితే ##హల్ప్ చేస్తారు. చాలా వినయంగా వుంటారు. నాకే కాదు దుల్కర్ తో వర్క్ చేయడం ఎవరికైనా ఆనందంగా వుంటుంది. ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తారు.
ఈ చిత్రం మ్యూజిక్ గురించి ?
ఇందులో రెండు పాటలు వున్నాయి. షాన్ రోమన్ ఒక పాట చేశారు. మరో పాట, నేపధ్య సంగీతం జేక్స్ బిజోయ్ చేశారు. మ్యూజిక్ బ్రిలియంట్‌గా వుంటుంది. ఆడియెన్స్‌చాలా ఎంజాయ్ చేస్తారు.
మీరు ఎలాంటి చిత్రాలు చేయాలని అనుకుంటారు?
నాకు అన్ని రకాల చిత్రాలు చేయాలని వుంటుంది. దసరా సినిమా నాకు చాలా నచ్చింది. అందులో కీర్తి సురేష్ పాత్ర నాకు చాలా ఇష్టం. సమంత గారి సినిమాలు కూడా ఇష్టం. సాయి పల్లవి కూడా చాలా ఇష్టం.
తెలుగులో మీకు ఇష్టమైన హీరో ? హీరోయిన్ ?
అల్లు అర్జున్ గారు. తన స్టయిల్ తో ప్రేక్షకులని కట్టిపడేస్తారు.
డ్రీమ్ రోల్స్ ఉన్నాయా ?
డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు, కానీ నేను చేసి పాత్రలు గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటాను.