Saturday, October 19, 2024

TG | బలగం ఫేమ్ కొమురమ్మకు స్పీకర్ ఆర్థిక సాయం..

బ‌ల‌గం మూవీ ఫేమ్ కొముర‌మ్మ‌, మొగిల‌య్య‌ల‌కు తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఆర్ధిక సాయం అంద‌జేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారక అవార్డు సభలో గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బలగం ఫేమ్ కొమురమ్మ మొగిలయ్య ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయి… తన నెల జీతం నుంచి రూ.లక్ష ఇస్తానని హామీ ఇచ్చాడు.

దీంతో ఇచ్చిన మాట ప్ర‌కారం… నేడు మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికార నివాసంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కొమురమ్మ, మొగిల‌య్య‌ల‌కు రూ.లక్ష చెక్కును అందజేశారు. తమకు ఆర్థిక సాయం అందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ కు కొమురమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబ్బును తన భర్త మొగిలయ్యకు మెరుగైన వైద్యం కోసం వినియోగిస్తానని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement