Tuesday, November 26, 2024

నా సోల్ మెట్ ,బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకున్నా…

ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు పెళ్ళి పీట‌లు ఎక్కుతున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ విల‌క్ష‌ణ హీరో రాజ్ కుమార్ రావు త‌న చిర‌కాల ప్రేయసి పత్రలేఖని వివాహం చేసుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చండీగఢ్‌ వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య రాజ్‌కుమార్‌ రావు, పత్రలేఖల వెడ్డింగ్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ రావు, పత్రలేఖలు తమ వివాహ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. రాజ్‌ కుమార్‌ తన భార్య పత్రలేఖ నుదుటున కుంకుమ దిద్దుతున్న ఫోటోను షేర్‌ చేస్తూ..11సంవత్సారాల ప్రేమ,స్నేహం,వినోదం తరువాత నా సర్వసం, నా సోల్ మెట్ ,బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకున్నా.. అనే పేర్కొన్నాడు రాజ్‌కుమార్‌ రావు. ఈ ఫోటోలనలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement