లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి పేదల గుండెల్లో దేవుడయ్యాడు రియల్ హీరో సోను సూద్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో…. విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. అయితే ఈ సమయంలో చాలా మంది గ్రామీణ విద్యార్థులు ఇంటర్నెట్ సౌకర్యం లేక పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్ గా నాగ పూర్ కు సమీపంలో గొడియా జిల్లాలో ఓ గ్రామనికి ప్రజలు ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏం చేయాలో తెలియక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా సోనూ కితెలిపాడు. దీనిపై స్పందించిన సోనూ సూద్… ఆ గ్రామంలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా…అతి తక్కువ టైం లోనే మొబైల్ టవర్ ఏర్పాటు చేయించి వారి మనసులను గెలుచుకున్నాడు. టారువతగా వీడియో కాల్ ద్వారా ఆ గ్రామస్థులతో మాట్లాడారు. దీంతో మరోసారి నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపించారు.