కరోనా కష్టకలంలో దేశప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా ముందుకెళ్లిన సోనూసూద్ ఇప్పడు నేషనల్ హీరోగా మారారు..అయితే ప్రస్థుత కరోనా తగ్గుముఖం పట్టినప్పటికి తన సేవలను కొనసాగిస్తున్నారు..అంతేకాదు.. వీలు చిక్కినప్పుడు ఇతరత్రా సామజిక సమస్యలపై ఆయన ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే చిరు వ్యాపారులకు అండగా నిలువాలని సోనూసూద్ కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా #supportsmallbusiness హ్యాష్ ట్యాగ్ తో క్యాంపెయిన్ చేస్తున్నారు. క్యాంపెయిన్ చేయడమే కాదు…తానే స్వయంగా ఫీల్డ్ లోకి దిగి మిల్క్ మ్యాన్ గా, రొట్టెలు తయారు చేసే దాబా యజమానిగా సోనూసూద్ మారిపోయాడు.
పేద, మధ్యతరగతి కుటుంబాలు చేసుకునే చిరు వ్యాపారాలు దేశానికి వెన్నెముకగా నిలుస్తాయన్న సోనూసూద్..వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేయగా వైరల్ కూడా అయ్యాయి. నేషనల్ మీడియాతో సోనుసూద్ మాట్లాడుతూ..చిరు వ్యాపారం దేశానికి వెన్నెముక. చిన్న వ్యాపారాలను ప్రమోట్ చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. చిరు వ్యాపారులకు మద్దతుగా నిలువాల్సిన అవసరముంది. చాలా మంది చిన్న వ్యాపారులు తమ రోజువారీ జీవనోపాధిని కొనసాగించలేకపోతున్నారు. నిజాయితీగా పనిచేసుకుంటూ రోజూ వారి సంపాదన కోసం ఎంత కష్టపడతారో చూసిన తర్వాత వారికి నా వంతు సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్ననాని తెలిపారు. తాను చిన్న పట్టణం నుంచి వచ్చానని… ప్రజలు తమ చిన్నపాటి వ్యాపారాన్ని నడిపించుకునేందుకు ఎంత కష్టపడతారో తనకు తెలుసని.. చిరు వ్యాపారులకు సహకారమందిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలువొచ్చు. ఈ చిన్న వ్యాపారాలు దేశంలోని గ్రామాల్లో అట్టడుగు క్షేత్ర స్థాయి నుంచి పనిచేస్తాయి. వారికి సాయంగా నిలవడం చాలా అవసరమని సోనూసూద్ సూచించారు.