రియల్ హీరో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయసహకారాలు చేసి వారి పాలిట దేవుడయ్యాడు సోనూసూద్. అంతేకాకుండా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదాత గా నిలిచాడు. అయితే తాజాగా ఆయన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సోనూ.
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు నాకు నేర్పిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్ళీ చూసే వరకూ ఎప్పుడూ అలాగే ఉంటుంది అంటూ… ట్విట్టర్లో పోస్ట్ చేశాడు సోనూసూద్. అలాగే తన తల్లి ఫోటోలను కూడా షేర్ చేశాడు.