Sunday, November 3, 2024

2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ చిత్రం

సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటునే.. నిజ జీవితంలో మాత్రం అందరిచేత రియల్‌ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది అన్నార్థులకు సాయం చేశాడు లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత ఖర్చులతో స్వదేశానికి తీసుకొచ్చాడు. అలాగే ఆపదలో ఉన్న ఎంతో మంది పేదకు ఆర్థిక సాయం అందించాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు .ప్రస్తుతం ఒక స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నాడు. సోనూసూద్‌ని నటుడి కంటే గొప్ప మానవతావాదిగా అభిమానించేవాళ్లే ఎక్కువ. ప్రతి రాష్ట్రంలో సోనూసూద్‌ అభిమాన సంఘాలు ఉన్నాయి. తమ రియల్‌ హీరో మాదిరే వాళ్లు కూడా మంచి పనులు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.తాజాగా సోనూ సూద్ అభిమానులు 2500 కేజీల బియ్యంతో ఆయన చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు. ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూ సూద్ రూపాన్ని తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న తుకోజీరావు పవార్ స్టేడియంలో ఎకరం స్థలంలో సోనూ సూద్ చిత్రాన్ని బియ్యంతో రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Advertisement

తాజా వార్తలు

Advertisement