కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసే రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్. వేలాది మంది వలస కార్మికులకు స్వగ్రామాలకు తరలించి దేవుడయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఎంతో మందికి సహాయం చేస్తూ బెడ్స్, ఆక్సిజన్ ను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే సోనూ సూద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు.
కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్ లో
వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి
సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు
ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం
క్రితం వారు కన్నుమూశారు.