పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి చిత్రాలు నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ తా జా చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ”ఇచ్చ ట అందమైన ఫోటోస్ తీయబడును” అనేది ఉపశీర్షిక. చైతన్య రావుహీరోగా, లావణ్య హీరో యిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ప్రిన్స్ హెన్రీ సం గీతం అందించిన మొదటి లిరికల్ సాంగ్ ను నటు-డు ప్రియదర్శి విడుదల చేశారు. శ్రీనివాస మౌళి రాసిన ఈ గీతాన్ని ఎస్పీ చరణ్ ఆలపిం చాడు. కథా నేపథ్యాన్ని బట్టి 80ల నాటి రెట్రో మ్యూజిక్ ను గుర్తు చేసేలా కంపోజింగ్, ట్యూన్ కనిపిస్తున్నాయి. ఆ కాలంలో ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యంను గుర్తుకు తెచ్చేలా చరణ్ అద్భుతంగా పాడారు ఈ గీతాన్ని. ”కంటిచూపు నిన్నే దాటి పోనంటోందమ్మా.. కొం-టె- ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ.. మంటే పెట్టావమ్మా.. మందేపూశావమ్మా.. గుండె కాజేసి జెడ గం-టె- కట్టావమ్మా.. రంగమ్మా” అంటూ ఈ సాహిత్యం కాస్త ఫన్నీగా ఉన్నా.. రెట్రో ్టసల్ పిక్చరైజేషన్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంది.
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ పాట విడుదల చేయడం హ్యాపీ గా ఉంది. చైతన్య, నేను ఒకేసారి స్టార్ట్ అయ్యాం. అన్నారు. హీరో చైతన్య రా వు మాట్లాడుతూ ” రంగ మ్మ పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్. ఈ పాటతో ప్రేమలో పడిపోయాం. ” అన్నారు.
సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ మాట్లాడుతూ దర్శకుడి టేస్ట్ కు తగ్గట్టు-గా.. సినిమా నేపథ్యానికి అనుగుణంగా ఈ పాటను రెట్రో ్టసల్ ను గుర్తు చేస్తూ కంపోజ్ చేయడం జరిగింది. అన్నారు. నిర్మాత యశ్ రంగినేని మాట్లాడుతూ ఎస్పీ చరణ్ గారు చాలా బాగా పాడారు. శ్రీనివాస్ మౌళి గమ్మత్తైన పదజాలంతో అందించిన లిరిక్స్ చాలా బావున్నాయి. అన్నారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ప్రిన్స్ హెన్రీ ఈ పాటను చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు. సౌండింగ్ కొత్తగా ఉంటు-ంది. సినిమాలో కూడా ఒక మంచి సిటు-్య యేషన్‌లో వస్తుంది. అన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలోచైతన్యరావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత ఆదిత్య నటిస్తున్నారు.