సోనమ్ కపూర్ పరిచయం అవసరం లేదు. ధనుష్ సరసన రాంజానా లాంటి జాతీయ అవార్డ్ చిత్రంలో నటించిన సోనమ్ పలు సినిమాల్లో అవార్డ్ విన్నింగ్ ప్రదర్శనలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇటీవల సోనమ్ సినిమాలను తగ్గించి తన బిజినెస్‌మేన్ హబ్బీతో కలిసి విదేశాల్లో నివసిస్తోంది.
అయినా సోషల్ మీడియాల్లో నిరంతరం తనదైన ఫ్యాషన్ సెన్స్ తో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. తాజాగా సోనమ్ గోల్డ్ కలర్ స్కర్ట్ సూట్‌లో మెరిసిపోయింది. ఈవెంట్లో మెరిసే కోచర్ స్కర్ట్ సూట్‌లో కనిపించగా.. ఇది తమరా రాల్ఫ్ 2024 కలెక్షన్ నుండి ఎంపిక చేసుకున్న డిజైనర్ లుక్.
దీనికి గొలుసు అలంకరణ.. మోకాళ్ల వరకు ఉన్న దుస్తులకు గోల్డ్ షేడ్స్‌లో ఉన్నాయి. తన అలంకరణకు తగ్గట్టుగా బంగారు నగలతోను అలంకరించుకుంది. చంకీ చైన్ స్టేట్‌మెంట్ గోల్డ్ నెక్లెస్ పెద్ద స్టడ్ చెవిపోగులతో సోనమ్ ఒద్దికగా కనిపించింది.