సోషల్ మీడియాల్లో స్పీడ్ చూపించే కథానాయికల్లో సోనాల్ చౌహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఫ్యాషన్ ఈవెంట్లు, ఫోటోషూట్లతో ఇన్ స్టా అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ -2024 ఈవెంట్లో సోనాల్ గుబులు రేపే ఫోజులు కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీట్ గా మారాయి.
ఈవెంట్లో వన్ ఇన్ఫినిట్ కోసం సోనాల్ 5వ రోజున సెజల్ శారీతో వేదికపై ప్రదర్శించారు. దీనికి వన్ ఇన్ ఫైనైట్, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, అల్టిమేట్ ఫేస్ డెఫినేషన్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించారు. ప్రస్తుతం సోనాల్ ర్యాంప్ వాక్ కి సంబంధించిన వీడియో లాక్మే ఫ్యాషన్ వీక్ ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా దూసుకెళుతోంది. సాంప్రదాయ డిజైనర్ లో సోనాల్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోందంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు.