మా టీవీలో ప్రసారమైన ‘బిగ్ బాస్’ షోతో వెలుగులోకి వచ్చిన సొహైల్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా లొకేషన్లో ఓ సభ్యుడితో సొహైల్ వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవ కాస్తా చిన్నపాటి ఘర్షణకు దారి తీసింది. లొకేషన్లో ఉన్న సభ్యులు ఎంత చెప్పినా వినకుండా ఇద్దరూ పరస్పరం పెద్ద పెద్దగా కేకలు వేసుకున్నారు. ఈ గొడవ వల్ల షాక్‌కు గురైన నిర్మాత.. తనకి ఇలాంటివి నచ్చవని.. కాబట్టి వెంటనే గొడవ ఆపాలని ఇద్దరికీ సూచించాడు. మరోవైపు హీరోయిన్ సైతం బిత్తరపోయింది.
కట్ చేస్తే.. ఇదంతా నిజం కాదని సదరు వీడియోలో స్పష్టమైంది. కేవలం ప్రాంక్ కోసం మాత్రమే తాము గొడవపడ్డామని సొహైల్ చావుకబురు చల్లగా చెప్పినట్లు చెప్పాడు. అంతేకాకుండా ఈ ప్రాంక్ గురించి నిర్మాతతో పాటు హీరోయిన్‌కీ తెలియదని పేర్కొన్నాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.